జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో, గత ఏడాది కాలంలో అందించిన వైద్య సేవల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.