ఘనంగా భగవద్గీత అవతరణ దినోత్సవం

2చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని విజయ ఉన్నత పాఠశాలలో సోమవారం భగవద్గీత అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు భగవద్గీతలోని శత శ్లోకాలను సామూహికంగా పారాయణం చేశారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యన్నగారి భూమయ్య మాట్లాడుతూ, భగవద్గీత జీవన విధానాన్ని నేర్పుతుందని, ప్రతి ఒక్కరూ గీతను చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోశాధికారి ఆడెపు సుధాకర్, కరస్పాండెంట్ మంచిర్యాల నాగభూషణ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు విజయలక్ష్మి, ఆమెడ కిషన్, ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :