పాలాజీ గణపతిని దర్శించుకున్న భైంసా ఏఎంసి చైర్మన్
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మహారాష్ట్ర సరిహద్దులోని పాలాజీ గణపతి ఆలయాన్ని భైంసా ఏఎంసి చైర్మన్ షిండే ఆనందరావు పాటిల్ సోమవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆలయానికి రెండు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారని కమిటీ తెలిపింది. ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.