ఈ నెల 19, 20 వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన 4వ ఇంటర్-డిస్ట్రిక్ట్ జూనియర్ వూషూ ఛాంపియన్షిప్ లో నిర్మల్ జిల్లా ఖేలో
ఇండియా శిక్షణ కేంద్ర క్రీడాకారులు అనన్య, ఆయుష్, రామ్ చరణ్, స్వర్ణ పతకాలను సాధించగా, మహేష్ రజత, అధిమన్యు, రితీష్ లు కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వూషూ కోచ్ సాయికృష్ణ తెలిపారు. వీరిని జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ తేజేందర్ సింగ్, శ్రీకాంత్, అధ్యక్షులు రాజశ్రీ, కార్యదర్శి జ్ఞానతేజ పాల్గొన్నారు.