బాసరలో భక్తిశ్రద్ధలతో భజన, పూజ కార్యక్రమాలు

0చూసినవారు
నిర్మల్ జిల్లా బాసర సర్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం భజన, పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం హార్మోనియం, తాళాలు, మృదంగం వాయిద్యాలతో భక్తులు భక్తి గీతాలు ఆలపించి ఆలయాన్ని భక్తిమయం చేశారు. సాయంత్రం జరిగిన ప్రత్యేక పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్