నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా ఆదివారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పూర్వపు కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌లు, వివిధ శాఖల అధికారులు ఆయనకు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు జీవరత్నం, డాక్టర్ రాజేందర్, శ్రీనివాస్, నరసింహ రెడ్డి, దయానంద్, భోజన్న, విజయలక్ష్మి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.