తానూర్
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా తానూర్ కు చెందిన భీంరావ్ పవార్ నియమితులయ్యారు. దేగాంలో మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి సమక్షంలో నాయకులు ఆయనను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పదవి ఇచ్చినందుకు భీంరావ్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.