బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళను అవమానిస్తూ మాట్లాడడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసుల కళ్లుగప్పి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో 'ముస్లిం అంటే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటే ముస్లిం' అని మాట్లాడిన రేవంత్ రెడ్డి, హిందూ దేవీదేవతలను అవమానించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నేలకు ముక్కురాకి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.