సోమవారం, బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి, హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం రూ. 6.30 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని వారు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7వ తేదీన హిల్ట్ పాలసీ జీఓ, జీహెచ్‌ఎంసీ పరిధి పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.