నిర్మల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, 40 వార్డుల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను ఆదివారం పార్టీ జిల్లా ఎన్నికల ఇంచార్జి బస్వపురం లక్ష్మి నర్సయ్య, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. మిగతా అభ్యర్థుల పూర్తి జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.