స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా, సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ గుర్రం రాము శనివారం తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయ సమీపంలో ఉదయం 9 గంటలకు శిబిరం ప్రారంభమవుతుంది. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఉన్నందున, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయాలని ఆయన కోరారు.