తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబ సభ్యులు సోమవారం కలుసుకున్నారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు, సతీమణి, కుమారులు, సోదరులు రాహుల్ గాంధీని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న బొజ్జు పటేల్ ను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు.