నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టనున్న ఓటరు జాబితా సవరణలో ప్రతి బూత్ పరిధిలోని ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని ఆయన సూచించారు.