ఆరోగ్యవంతమైన శిశువుకు తల్లిపాలే తొలివరం: సర్పంచ్

0చూసినవారు
ఆరోగ్యవంతమైన శిశువుకు తల్లిపాలే తొలివరం: సర్పంచ్
నిర్మల్ జిల్లా, మామడ మండలంలోని కమల్కోట్ గ్రామంలో బుధవారం అంగన్వాడీ స్కూల్లో తల్లి పాల వారోత్సవాలు సర్పంచ్ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు అన్నప్రాసన నిర్వహించి, వారికి క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని సర్పంచ్ సూచించారు. ఆరోగ్యవంతమైన శిశువుకు తల్లిపాలే తొలివరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మెడికల్ ఆఫీసర్ ప్రియాంక, కార్యదర్శి శ్రీలత, హెడ్మాస్టర్ మన్మధ రెడ్డి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్