నిర్మల్ మున్సిపాలిటీలోని 38వ వార్డు నుండి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి మారుగొండ యోగిత గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక జడ్పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రంలో తన భర్త, పార్టీ పట్టణ అధ్యక్షులు మారుగొండ రాముతో కలిసి నామినేషన్ పత్రాలు అందజేశారు. తనపై నమ్మకంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారని యోగిత తెలిపారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేతృత్వంలో నిర్మల్ మున్సిపాలిటిపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.