నిర్మల్ జిల్లా, ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ రాథోడ్ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని
ఎన్టీఆర్ చౌకు నుండి తల్లి తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగించారు. మహిళలకు రూ. 2500, తులం బంగారం, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.