బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేసి బీజేపీలో చేరిక
నర్సాపూర్ మండలం రాంపూర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులు రావుల నర్సయ్య, మంత్రి ప్రవీణ్ లు ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా కార్యదర్శి అర్జున్, మండల నాయకులు మహిపాల్, సాయన్న, రమేష్, గణేష్, ముత్యం లు పాల్గొన్నారు.