నిర్మల్ జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో భాగంగా పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.