నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను అభినందించారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అన్నదానం నిర్వహిస్తున్నారని, వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు బస్టాండ్‌లో మజ్జిగ పంపిణీ చేస్తున్నారని తెలిపారు.