ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

0చూసినవారు
ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు గ్రామ సర్పంచ్ గుర్రం రాము ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలు వడదెబ్బకు గురి కాకుండా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.