కార్బన్ ఉద్గారాలతో పర్యావరణానికి ముప్పు

0చూసినవారు
కార్బన్ ఉద్గారాలతో పర్యావరణానికి ముప్పు
శూన్య కర్బన ( జీరో కార్బన్ ఎమిషన్) వారోత్సవాల చివరి రోజైన నేడు నిర్మల్ లోని టియన్జీఓ భవన్లో జన విజ్ఞాన వేదిక నిర్వాహకులు సమావేశమయ్యారు. కార్బన్ ఉద్గారాల వల్ల గ్రీన్ హౌస్ వాయువులు పెరిగి పర్యావణానికి ముప్పు ఏర్పడుతుందని, సౌర ఇందనాలను వాడి, చెట్లను అధికంగా నాటి, ప్లాస్టిక్ నిషేదించి, పర్యావరణ హిత కార్యక్రమాల ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని వారు కోరారు. కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ రఫీక్, మాలావత్ బిక్షపతి, నాయక్ జెవివి కార్యనిర్వాహక సభ్యులు గజపల్లి నర్సయ్య, నారాయణ వర్మ, గంగాధర్, అనంత విశ్వేశ్వర్, ముత్తన్న వెంకట రమణ, అంబటి నారాయణ, ధన్సింగ్, గంగన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్