వైభవంగా బ్రహ్మంగారి 333వ ఆరాధన దినోత్సవం

3చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ లో గల శ్రీశ్రీశ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామివారి 333వ ఆరాధన దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకరణ, వివిధ పూజలు నిర్వహించి, అనంతరం మహా యజ్ఞ కార్యక్రమం చేపట్టారు. మాలధారణ స్వాములు మాలవిరమణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :