హైదరాబాద్‌లోని పుష్పగిరి మహాసంస్థానంలో నిర్వహించిన నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ప్రథమ శతావధానంలో నిర్మల్‌కు చెందిన ప్రముఖ పద్యకవి డా. బి. వెంకట్ ‘శతావధాన ప్రాశ్నిక సన్మానం’తో పాటు ప్రతిభా పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాదీశ్వరులు శ్రీ అభినవోద్దండ విద్యా శంకర భారతీస్వామి, తనికెళ్ల భరణి, గరికపాటి నరసింహారావు తదితరుల చేతుల మీదుగా ఆయన సన్మానం పొందారు. 100 మంది ప్రాశ్నికులలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి డా. వెంకట్ ఒక్కరే ప్రాతినిధ్యం వహించి, దత్తపది అంశంపై సంస్కృతభారతి - భారతీయ సంస్కృతి విషయాలపై ప్రశ్నలను సమాధానాలు ఇచ్చారు.