చాత గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

832చూసినవారు
చాత గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నిర్మల్ జిల్లా, ముథోల్, నిర్మల్ జిల్లాలోని చాత గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతిని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని కొనియాడుతూ ఆమె ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్