బాసరలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

778చూసినవారు
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పోషించిన పాత్ర భావితరాలకు ఆదర్శమని సంఘం సభ్యులు అన్నారు. సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తొలి భూపోరాటానికి నాంది పలికి, దొరల ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ అని, ఆమె తెగువ బహుజన ధీరత్వానికి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, పూజలు నిర్వహించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్