నిర్మల పట్టణంలోని నాయుడు వాడ 2 అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. అంగన్వాడి సిబ్బంది చిన్నారులకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ గౌరీ సహజసిద్ధమైన రంగులతోనే హోలీ జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.