బాసరలో చిన్నారుల కోలాటం
నిర్మల్ జిల్లా బాసర పోచమ్మ గల్లీలోని శ్రీ గణేష్ మండలి వద్ద ఆదివారం చిన్నారులు ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. గణనాథుని ఆశీస్సులతో పిల్లలు లయబద్ధంగా, ఉత్సాహంగా కోలాటాలు వేసి భక్తులను అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాల గురించి వివరించారు. భక్తి భావం పెంపొందించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.