నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గురువారం అర్బన్ మండల స్థాయి సీఎం కప్ పోటీలను జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, బాక్సింగ్, అథ్లెటిక్స్ వంటి క్రీడలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.