ఏప్రిల్ 06న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరకు వస్తున్నారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా బాసరలో మాస్టర్ ప్లాన్ అమలు, ఆలయ పున:నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, ముధోల్ లో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కూడా బాసరలోనే జరుగుతుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆలయ పునర్నిర్మాణం జరగలేదని, ఈ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.