సీఎంగారు.. తులం బంగారం హామీ ఏమైంది..

2చూసినవారు
సీఎంగారు.. తులం బంగారం హామీ ఏమైంది..
నిర్మల్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్​ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన నిలదీశారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో 273 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :