రూ. 5. 50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కు అందజేత

2చూసినవారు
రూ. 5. 50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కు అందజేత
నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్ గ్రామానికి చెందిన గంటడి స్వప్న అనే మహిళ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మెరుగైన వైద్యం కోసం రూ. 5.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం లబ్ధిదారు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేందర్, సన్నిత్ రెడ్డి, సృజన్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్