బోసి కర్ర వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్ భవేశ్

2చూసినవారు
బోసి కర్ర వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్ భవేశ్
తానూర్ మండలం బోసి గ్రామంలోని శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడిని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ కు పూజారులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. శివాలయంలోని గణేశుడికి, శివునికి పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టర్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, కలిసిమెలసి జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్