మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సారంగాపూర్ మండలం కౌట్ల (బి) రైతు సంఘానికి 3 లక్షల 85 వేల సబ్సిడీతో డ్రోన్, పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, వ్యవసాయ పనుల్లో ఆధునిక యంత్రాల వాడకం వల్ల పనులు సులభతరం అవుతాయని, తక్కువ కాలంలో, తక్కువ శ్రమతో పూర్తవుతాయని, తద్వారా రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. మరిన్ని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.