నిర్మల్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ అభిలాష అభినవ్. కొత్త ఏడాదిలో జిల్లా ప్రజల జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధిని ఆకాంక్షించారు. గత ఏడాదిలో జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. రాబోయే న్యూ ఇయర్ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో అందేలా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు.