మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

0చూసినవారు
మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే రాజకీయ వార్తలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని డీపీఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను ఆమె ప్రారంభించారు. రోజువారీగా వార్తాపత్రికలు, లోకల్ చానళ్లలో వచ్చే వార్తలను నిశితంగా గమనిస్తూ, అనుమానిత పెయిడ్ న్యూస్ వివరాలను నమోదు చేయాలని సూచించారు. అన్ని రకాల రిజిస్టర్లను జాగ్రత్తగా నమోదు చేయాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై కూడా నిఘా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :