నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో గల బస్తీ దవాఖానను కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను పరిశీలించి, రోగులకు సేవా దృక్పథంతో వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, అధికారులు సౌమ్య, స్థానిక కౌన్సిలర్ తౌహిద్ ఉద్దిన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.