జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం చివరిదశలో ఉన్న అత్యవసర వైద్య సేవల విభాగాన్ని బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ విభాగాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాపులను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నిర్మాణం పూర్తయిన వివరాలు, ఇంకా చేపట్టవలసిన పనులను ఆయన అడిగి తెలుసుకున్నారు.