ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శనివారం కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, రైతులు తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని సూచించారు. నిర్ణీత సమయానికి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.