ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని, గతంలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ పాల్గొన్నారు.