సారంగాపూర్ మండలంలోని అర్కాయి తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు అటవీశాఖ ఇబ్బందులు తొలగించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత 40 ఏళ్లుగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 40 కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా, నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని లబ్ధిదారులు వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇళ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని వారు కోరారు.