నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్ కు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. వశిష్ట పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే నోటు పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్ ఇతర సౌకర్యాలు అందించడం లేదని, సరైన విద్యా, హాస్టల్ వసతి లేక
విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.