కలెక్టర్ కు శుభాకాంక్షలు వెల్లువ

శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ అభిలాష అభినవ్ ను పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు నోటు పుస్తకాలు, పూల మొక్కలు, పుష్ప గుచ్చాలను అందించారు. పలు శాఖల ఉద్యోగ సంఘాలకు చెందిన డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులంతా ఉత్సాహంతో పని చేస్తూ, జిల్లాను అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంచాలని పేర్కొన్నారు.
