ఇటీవల ఢిల్లీలో రెండు స్కోచ్ అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మంగళవారం కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో పలువురు అధికారులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించి అభినందించారు. పొనికివనం ఏర్పాటు, అమ్మరక్షిత కార్యక్రమాల విజయవంతంలో ఆమె కృషిని అధికారులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, డిఈఓ భోజన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు దయానంద్, మోహన్ సింగ్ తదితరులు కలెక్టర్ ను అభినందించారు.