పదో తరగతి వార్షిక పరీక్షల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ అన్నారు. గురువారం ఆయన డీఈఓ దర్శనం భోజన్నను శాలువాతో సత్కరించి అభినందించారు. జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రగతిని కనబరిచి రాష్ట్రంలో టాప్ 3లో నిలవడం హర్షనీయమని, రానున్న రోజుల్లో ఇదే తరహాలో ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ జిశాన్ అలీ పాల్గొన్నారు.