నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని శ్రీహరిరావు ధీమా వ్యక్తం చేశారు.