నిర్మల్ పట్టణంలోని 36, 37, 38వ వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్‌కు బానిసలుగా మారాయని విమర్శించారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మూడు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. నిర్మల్ పట్టణ ప్రజలు ధర్మం వైపు నిలబడి బీజేపీని గెలిపించాలని ఆయన ఇంటింటికి వెళ్లి కమలం పువ్వుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.