వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవడంలో విఫలమైందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చేతికి వచ్చిన పంట తుఫాన్ ధాటికి నేలమట్టమైందని, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతుండగా, రైతు సంఘాలు 10 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని అంటున్నాయని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.