సీనియర్ రిపోర్టర్ రవీందర్ ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

4చూసినవారు
సీనియర్ రిపోర్టర్ రవీందర్ ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
నిర్మల్ జిల్లా కేంద్రంలో సీనియర్ రిపోర్టర్ రవీందర్ కు ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు గారితో పాటు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, మాజీ జెడ్పి కోఆప్షన్ సభ్యులు అతి హైమద్, కొట్ట శేఖర్, గాజుల రవికుమార్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you