ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

0చూసినవారు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి
జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వారం రోజుల్లోపు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, లబ్ధిదారులకు మంజూరైన గృహాల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఎంపికైన లబ్ధిదారులు వెంటనే పునాది పనులు మొదలుపెట్టేలా క్షేత్రస్థాయి అధికారులు ప్రోత్సహించాలని, నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. పనులు పూర్తయిన దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యేలా చూడాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.