
వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోండి: మైఖేల్ వాన్
15 ఏళ్ల భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసించారు. ఈ IPLలో 17 బంతుల్లో 52 పరుగులు చేసిన వైభవ్ 'ఫియర్ లెస్' యాటిట్యూడ్‌ను వాన్ మెచ్చుకున్నారు. ఈ యువ ఆటగాడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలని BCCIకి సూచించారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోయినా, సీనియర్లతో కలిసి ఉండటం ద్వారా అతనికి మంచి అనుభవం వస్తుందని వాన్ అభిప్రాయపడ్డారు.




